శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు MLA

రాజమండ్రి రూరల్ నియొజకవర్గం

 

రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజా సమస్యల సత్వర  పరిష్కారానికి,  ప్రభుత్వం అమలుపరిచే ప్రజా సంక్షేమ  కార్యక్రమాలు  మీకు సరైన రీతిలో చేరవెయ్యాలని సదుద్దేశంతో, “మీ గోరంట్ల ”  అనే మొబైల్ అప్ప్లికేషన్ మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం

సదా మీ సేవలో
మైలురాళ్ళు
జ్ఞాపకాలు
చంద్రన్న భీమా
యువ నేస్తం
... మరిన్ని పధకాలు

రాజమహేంద్రవరం నగరం మరియు పరిసర ప్రాంత గ్రామాలను సుందరంగా తీర్చిదిద్ది, మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించి, నిరంతరం ప్రజా సంక్షేమాల కోసం కృషి చేస్తున్న మన ప్రియతమ నేత రాజమండ్రి ముద్దుబిడ్డ, మాజీ మంత్రి, రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెబ్ సైట్ కి స్వాగతం, సుస్వాగతం .

శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు , 35 సవత్సరాలుగా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ అభివృదికి పనిచేసారు. క్రమశిక్షణ సంఘం సభ్యడిగా పనిచేసారు. రాష్ట ప్రదాన కార్యదర్శిగా ఉత్రరాంధ్ర,కోస్తాంధ్ర మరియు రాయలసీమకి పనిచేసారు. అనేక కమీటీలలో పనిచేసి,ఇతరాత్ర పదవులలో కొనసాగి అనేక కార్యక్రమాలు చేపట్టారు.

ముఖ్యంగా రాజమహేంద్రవరంకి రూపురేఖలు తేవడంలో  ప్రదానమైన పాత్ర పోషించారు.మంచినీటి సరఫరా, పాటశాల  భవనాల నిర్మాణం,హాస్పటల్స్‌ అభివృద్దిలో,రోడ్లు వైశాల్యం, గోదావరి గట్టు సుందరీకరణ, ప్రజా మరుగుదొడ్లు,ఈ సేవా కేంద్రాలు మీ సేవా కేంద్రాలు, కరెంట్‌ సరఫరా మరియూ ఉద్యానవనాల అభివృద్దిలో గణనీయంగా కృషి చేసారు, నగరం మీద మంచి పట్టున్న వ్యక్తిగా నిలిచారు.

పలు విధాలుగా నగరాబివ్రుద్దికి  కృషి చేస్తూ , ఒక అనుభవం కలిగిన సీనియర్ నాయకుడిగా చట్టసభల్లో తనదైన శైలిలో  రాష్ట్ర సమస్యలపై ఎలుగెత్తి చెప్పేవారు.

పోలవరం అమరావతి పై ముఖ్యమంత్రి గారికి సలహాలు సూచనలు ఇస్తూ. క్రమశిక్షణతో, విలువలతో కూడిన, మచ్చ లేని  రాజకీయ నాయకుడిగా, ప్రజలకోసం పార్టీకోసం పాటుపడే ప్రజానాయకుడిగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం MLA అభ్యర్ది గా  మరొక్కసారి మీ ఓఅట్లు అడగటానికి మీ ముందుకు వస్తున్నారు

సదా మీ సేవలో శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి 

35 సంవత్సరాల రాజకీయ జీవితంలో కొన్ని మైలు రాళ్ళు

...
...
2019 May

ఆరవ సారి MLA గా గెలుపు

రాష్ట్రమంతా స్వంత పార్టీకీ వ్యతిరేక పలితాలు వచ్చినప్పటికి, రాజమండ్రి రూరల్ ప్రాంతంలో వారు చేసిన అభివ్రుద్దికి పట్టం కట్టి , ప్రజలు తిరిగి 6 సారి MLA గా గెలిపించుకున్నారు.
2014 June

ఐదవ సారి MLA గా గెలుపు

2014 రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం నుండి గెలవడం జరిగింది. రాజమహేద్రవరం రూరల్‌  గ్రామాలకి రూపురేఖలు తేవడంలో  ప్రదానమైన పాత్ర పోషించారు.మంచినీటి సరఫరా, పాటశాల  భవనాల నిర్మాణం,హాస్పటల్స్‌ అభివృద్దిలో,రోడ్లు వైశాల్యం, గోదావరి గట్టు సుందరీకరణ, ప్రజా మరుగుదొడ్లు,ఈ సేవా కేంద్రాలు మీ సేవా కేంద్రాలు, కరెంట్‌ సరఫరా మరియూ ఉద్యానవనాల అభివృద్దిలో గణనీయంగా కృషి చేసారు, నగరం మీద మంచి పట్టున్న వ్యక్తిగా నిలిచారు. 
1999 August

నాలుగవసారి MLA గా గెలుపు

1999 ఎన్నికల్లో మరలా నాలుగవసారి MLA ఎన్నికయ్యి రాజమహేంద్రవరం నగరం మరియు పరిసర ప్రాంత గ్రామాలకు సేవలందించారు
1995 May

రాష్ట్ర కేబినెట్ మంత్రిగా సేవలందించటం

1995_1999 మధ్య ప్రళాలికా బోర్డు ఉపాధ్యక్షుడిగా మరియు AP TECHNO SERVICES చైర్‌మెన్‌గా  భాద్యతలు  నిర్వర్తించారు, అదే సమయంలో APSRTC డైరెక్టర్‌గా పనిచేసారు.  1995 లో రాష్ట్ర కేబినేట్ లో  CIVIL SUPPLIES మరియ VIGILANCE  మంత్రిగా  సేవలందించారు. 
1994 June

మూడవసారి MLA గా గెలుపు

1989 లో జరిగిన ఎన్నికలలో ఎదురైన ఓటమిని ప్రజ తీర్పుగా బావించి, మరింత పట్టుదలతో  1993 లో  మెట్టమెదటిసారిగా భారిఎత్తున రాజమహేంద్రవరంలో మహానాడు ఎర్పాటు చెయ్యడం, 1994 ఎన్నికల్లో భారీ మెజారిటీతో MLA గా మూడవసారి గెలవటం జరిగింది. 
1985 August

రెండవసారి MLA గా గెలుపు

1984 లో వచ్చిన పార్టీ పరిరక్షణ ఉధ్యమంలో రామారావు గారితో పనిచేయటం తరవాత 1985 లో వచ్చిన మధ్యంతర ఎన్నికలో మళ్ళీ గెలవటం జరిగింది.
1983 January

మొదటిసారి MLA గా ఎన్నిక

1982 చివరిలో జరిగిన ఎన్నికల్లో 38000 పైచిలుకు మెజారిటీతో MLA అభ్యర్దిగా గెలవటం జరిగింది
1982 March

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం

1982 మార్చిన అన్నగారు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్తాపించారు.  ఆనాడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు వారిసోదరుడు రాజేంద్రప్రసాద్‌ గారితో కలిసి రాజమహేద్రవరం నుంచి పార్టీలో చేరడం జరిగింది.  తూర్పు మరియు పచ్చమగోదావరి జిల్లాలకు మొదటి కన్వీనర్‌గా ఎంపికకావడం, పార్టీ అభివృద్దికోసం పనిచేయటం జరిగింది.  ఆ తరువాత డిసెంబర్ వరకూ రామారావు గారి చైతన్య రధ యాత్రలో ముఖ్య పాత్ర పోషించి , ఇరు జిల్లాలో పార్టీని బలోపేతం చేయ్యటం జరిగింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఎంతోమంది అసంఘటిత రంగానికి చెందిన వారున్నారు. అధికారుల లెక్కల ప్రకారం రెండు కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అసంఘటిత కార్మిక రంగం పరిధి లోనికి వచ్చే ప్రతీవ్యక్తి యొక్క కుటుంబ రక్షణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు “చంద్రన్న భీమా పధకం” ఏర్పాటు చేసారు. భారత దేశంలో అసంఘటిత కార్మికులకు భీమా కల్పించిన ఏకైక రాష్ట్రము “ఆంధ్రప్రదేశ్”.

న‌మోదుకు అర్హ‌త‌లు వ‌య‌సు 18 నుంచి 70 సంవ‌త్స‌రాల మ‌ధ్య క‌లిగిన అసంఘ‌టిత రంగంలోని కార్మికులు రూ.15 చెల్లించిన పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, రేష‌న్ కార్డు బ్యాంకు ఖాతా వివ‌రాలు ఇవ్వాలి. ఇత‌ర ఏ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు అవ‌స‌రం లేదు. ఆధార్, బ్యాంకు ఖాతా లేనివారికి సైతం వాటిని స‌మ‌కూర్చి బీమా ప‌థ‌కంలో చేరుస్తారు. బీమా ప‌థ‌కం ప్రీమియంను రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే చెల్లిస్తుంది.

ఆసంఘ‌టిత రంగంలోని కార్మికులు అంటే?

  • ఎవ‌రైనా నెల‌కు రూ.15,000కు మించ‌కుండా ఆర్జించే వారు.
  • వ్య‌వ‌సాయం, అనుబంధ రంగాలైన పూలు,పండ్ల తోట‌ల పెంప‌కం, కొబ్బ‌రి కోయుట‌-వ‌లుచుట‌, ప‌శువుల పెంప‌కం, కోళ్ల పెంప‌కం మొద‌లైన రంగాల్లో ఉపాధి పొందుతున్న వారు
  • క‌మ్మ‌రి, కుమ్మ‌రి, క్షౌర వృత్తి, చేనేత, స్వ‌ర్ణ‌కారులు, చాక‌లి మొద‌లైన చేతి వృత్తుల వారు
  • వీధి వ్యాపారులు, చిన్న ఉత్ప‌త్తిదారులు, కిల్లీ, బ‌డ్డీ వంటి ఇత‌ర చిన్న వ్యాపార‌స్తులు, సైకిల్‌, స్కూట‌ర్, ఇత‌ర గృహోప‌క‌ర‌ణాల‌ను మ‌ర‌మ్మ‌తు చేసే చిన్న మెకానిక్‌లు క‌ళాకారుల వంటి స్వ‌యం ఉపాధి పొందే వారు
  • ఇంటి ప‌ని, ఇండ్ల‌లో వృద్దుల‌కు సేవ చేసేవారు, లెట‌ర్లు, పార్శిళ్లు, వ‌స్తువులు, బిల్లులు వంటివి చేర‌వేసే కొరియ‌ర్ బాయ్స్, పారిశుద్ధ్య ప‌నివారు,
  • ఇళ్ల వ‌ద్ద చెత్త సేక‌రించేవారు మొద‌లైన సేవా రంగం వ్య‌క్తులు అంగ‌న్ వాడీ, ఆశా వ‌ర్క‌ర్లు, ఆరోగ్య మిత్రా, బీమా మిత్ర‌, 104/108 మొద‌లైన ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లులో గౌర‌వ వేత‌నం పొందేవారు
  • గోదాములు, మార్కెట్ యార్డులు, దుకాణాలు, రైల్వే స్టేష‌న్లు, బ‌స్టాండ్లు, పోర్టులు, రేవుల వ‌ద్ద ప‌నిచేసే హ‌మాలీలు(లోడింగ్‌, అన్‌లోడింగ్ చేసేవారు) ప్ర‌భుత్వ మ‌రియు ప్రైవేటు ఆటో, కారు, వ్యాన్‌, ట్రాక్ట‌ర్‌, లారీ, బ‌స్సు వంటి రోడ్ ర‌వాణా ఇంకా లాంచీలు, ప‌డ‌వ‌లు, జ‌ట్టీలు, బ‌ల్ల‌క‌ట్టు వంటి జ‌ల ర‌వాణా రంగంలోని డ్రైవ‌ర్లు.
  • ఇత‌ర ప‌నివాళ్లు చిన్న దుకాణాలు, సంస్థ‌లు, వాణిజ్య సంస్థ‌లు, ఫ్యాక్ట‌రీల‌లో రేగుల, క్యాజువ‌ల్‌, తాత్కాలిక‌, దిన‌స‌రి వేత‌నం, పేస్ రేటు, క‌మిష‌న్ ప‌ద్ద‌తిని ప‌నిచేసేవారు
  • అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ప‌నివారు ప్ర‌భుత్వ శాఖ‌ల‌లో, ప్ర‌భుత్వ రంగ శాక‌ల‌లో మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, మున్సిపాలిటీ లేదా పంచాయ‌తీల‌లో ప‌నిచేసే అవుట్ సోర్సింగ్‌, కాంట్రాక్ట్ ప‌నివారు
  • భ‌వ‌నాలు లేదా ఇత‌ర నిర్మాణాల‌లో ప‌నిచేసే- తాపి ప‌ని, సెంట్రింగ్ ప‌ని, రాడ్ బెండింగ్‌, పంబ్లింగ్‌/ శానిట‌రీ, వండ్రంగి, రంగులు వేయడం, టైల్స్ ప‌ని, ఎల‌క్ట్రీషియ‌న్, బోర్ వెల్;
  • ఇంటిరీయ‌ర్ డిజైన్ ప‌ని, ఇటుక బ‌ట్టీలు, ఫ్ల‌య్ యాష్, ఇత‌ర ఇటుక‌ల త‌యారీ, ఇసుక క్వారీలు, రాళ్ల క్ర‌ష‌ర్లు, కాంక్రీట్ మిక్స్ చేసేవారు,
  • బావులు త‌వ్వ‌కం-పూడిక ప‌నిచేసేవాళ్లు, అన్ని ర‌కాల నిర్మాణ రంగాల్లో ప‌నిచేసే వారు,
  • నిర్వ‌హ‌ణ ప‌నులు చేస్తున్న వారు ఉపాధి హామీ ప‌థ‌కం(NREGS) ప‌రిధిలోకి వ‌చ్చే మేట్‌, మ‌ట్టి ప‌ని, ఇత‌ర ర‌కాల ప‌నివారు అర్హులు

    న‌మోదు ప్ర‌క్రియ,  క్లెయిం ప‌రిష్కారం

  •  గ్రామ సమాఖ్య అధికారి ఆధ్వర్యంలో అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియ జరుగుతుంది.
  •  ఈ పధకం క్రింద లబ్ది దారుల నమోదుకు గ్రామాలలో ,పట్టణాలలో, నగరాలలో నివాస స్థాయి నమోదు సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి.
  • ఈ పధకం క్రింద లబ్ది దారుల నమోదు మరియు పధకం ప్రయోజనాల అమలు పర్యవేక్షణ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలలో ఏర్పాటు చేసిన కమిటీల బాధ్యత.
  • జిల్లా కమిటీలో జిల్లా కలెక్టర్ అద్యక్షతన -ఫై.డి., డి.ఆర్.డి.ఓ. ఆధ్వర్యంలో ఈ పధకం అమలవుతుంది.
  • ఈ పధకం క్రింద అస్న్ఘతిత కార్మికుల నమోదు మరియు క్లైముల పరిష్కారములో లబ్దిదారులకు సహాయ పడడానికి “కార్మిక సహాయ కేంద్రాలను” గ్రామాలలో, మండలాలో, పట్టణాలలో,నగరాలలో ఏర్పాటు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి యువనేస్తం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యువనేస్తం అనే నూతన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని అర్హత కలిగిన సుమారు 12 లక్షల మంది నిరుద్యోగ యువతకు లబ్ది చేకూరుతుంది. యువత నైపుణ్యాభివృద్ధి / వృత్తి విద్యా కోర్సులు అభ్యసించేందుకు మరియు నిరుద్యోగ యువత యొక్క కుటుంబాలపై భారం తగ్గించేందుకు లబ్దిదారులకు నెల నెలా నిరుద్యోగ భృతిని అందజేస్తారు.

అర్హత ప్రమాణాలు

  • దరఖాస్తుదారులు నిరుద్యోగులై ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారై ఉండాలి.
  • కనీస విద్యా అర్హతలు గ్రాడ్యుయేషన్ లేదా అంతకుముందు రెండు సంవత్సరాలు ఏ డిప్లొమా అయి ఉండాలి.
  • 22-35 సంవత్సరాల వయస్సులో ఉండాలి.
  • కుల, సామాజిక ప్రాధాన్యత నిబంధనల ప్రకారం ఇవ్వబడుతుంది.
  • దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబానికి చెందినది. కుటుంబానికి చెందిన అన్ని అర్హత పొందిన లబ్ధిదారులను పరిగణనలోకి తీసుకోవాలి.
  • మూవబుల్ / అస్థిర ప్రాపర్టీస్: 4 చక్రాలు కలిగినవి అనర్హమైనవి. 2.5 ఎకరాల తడి భూమి కలిగి, 5.00 ఎకరాల గరిష్ట భూమిని గరిష్టంగా అర్హులు. అనంతపురం జిల్లాకు సంబంధించి పరిమితి గరిష్ట తడి భూములు 5.00 ఎకరాలు మరియు పొడి భూమి 10.00 ఎకరాల ఉంటుంది.
  • ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వాల కింద ఆర్ధిక సహాయం / ఋణం లభించిందో వారికి రూ. 50,000 / – రాయితీకి అర్హత లేదు.
  • అధికారిక విద్యను అభ్యసిస్తున్న వారు అర్హులు కాదు.
  • పబ్లిక్ / ప్రైవేట్ సెక్టార్ / క్వాసి-ప్రభుత్వం లేదా స్వయం ఉపాధిలో పనిచేసే వారు సహాయం కోసం అర్హత లేదు.
  • సెంట్రల్ / స్టేట్ ప్రభుత్వ సర్వీసు నుండి ఉద్యోగి తొలగించకూడదు. దరఖాస్తుదారు ఏ నేరారోపణ నేరారోపణను కలిగి ఉండరాదు.

నిరుద్యోగ భృతి పొందేందుకు ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి నమోదు చేసుకోవడానికి కావలిసిన ముఖ్య ధ్రువపత్రాలు – ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎస్.ఎస్.సి, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్.

1.ఇ ఔషధి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఆసుపత్రి లో ఏ మందులు అందుబాటులో ఉన్నాయని వివరాలను ఆన్లైన్ లో తెలుసుకునేందుకు వీలుగా ఇ ఔషధి కార్యక్రమాన్ని ని జూన్ 10 2015 న ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికిపైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 9 జిల్లా, 30 ప్రాంతీయ ఆస్పత్రులు ,11 వైద్య కళాశాలలు అనుబంధ ఆస్పత్రిలో ఈ విధానం అమలులోకి వచ్చింది

2.ఈ నిధి

ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ఐటీ ఆధారిత సమగ్ర ఆర్దిక నిర్వహణ వ్యవస్థ (సి ఎఫ్ ఎం ఎస్ ఎస్ ) కు ఈ నిధి అని పేరు పెట్టారు. * ( SAP )ఆధారంగా పనిచేసే ఈ కొత్త వ్యవస్థ తో బడ్జెట్ ఆదాయం వ్యయం మానవ వనరుల నిర్వహణ అకౌంట్స్ ,వేజ్ అండ్ మీన్స్ ,అప్పుల నిర్వహణ వ్యవహారాలను అనుసంధానం చేయనున్నారు.ఈ మొత్తం వ్యవహారాలన్నిటినీ ఆన్లైన్ ద్వారానే నిర్వహించనున్నందున ప్రభుత్వం దీనికి ఈ నీది అని నామకరణం చేసింది.

3. అభయం ఆప్ 

ఆపదలో ని మహిళలకు కు అండగా నిలిచేందుకు రూపొందించిన అభయం యాప్కు ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు మరిన్ని అదనపు హంగులు జోడిస్తున్నారు ఇప్పటివరకు కేవలం మహిళల సేవలకు పరిమితమైన దీన్ని పురుషులు కూడా వినియోగించేందుకు వీలుగా తీర్చిదిద్దారు.

అత్యవసర వేళల్లో యాప్లోని పానిక్ అనే మీటను నొక్కి వెంటనే ఆ సమాచారం ఆ నగరంలోని command కంట్రోల్ రూమ్ కు అక్కడ నుంచి చి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు చేరుతుంది. జిపిఎస్ ఎస్ ఏ ఆధారం గా మహిళ ఎక్కడ ఆపదలో ఉందో గుర్తించి ఐదు నిమిషాల వ్యవధిలో ఆ స్థలానికి చేరుకుని ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తారు.

4.మీ ఇంటికి – మీ భూమి

మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో భాగంగా అధికారులు గ్రామానికి వచ్చి కంప్యూటర్ లో ఉన్న భూముల వివరాలను వెల్లడిస్తారు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తమ భూములు సమ పేరుతో ఉన్నాయో లేదో ఏమైనా తప్పులు ఉంటే తెలుసుకుని వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సరి చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

5. గిరి గోరుముద్దలు పథకం:

పోషక ఆహార లోపం వల్ల గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులు రోగాల బారిన పడుతున్నారని 90 శాతం మరణాలకు కారణం ఇదేనని ,అందుకే గిరి ప్రాంతాల్లో ని ఆరు నెలలనుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు ‘గిరి గోరుముద్దలు ‘పథకాన్ని ప్రవేశపెట్టారు.

6.ఈ-ఆరోగ్యం

ఆన్లైన్లో రోగికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం కేస్ షీట్ నిర్వహిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టేందుకు ఈ ఆరోగ్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని విశాఖ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు పరుస్తారు.

7. ఈ ప్రగతి 

సమస్త ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా కంప్యూటరీకరించాలనే ఉద్దేశ్యంతో రూ .2358 కోట్ల ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును ఈ ప్రగతి ఇ పేరుతో పీపీపీ పద్ధతిలో చేపట్టాలని ఏపీ ప్రభుత్వం తీర్మానించింది.

మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1528 కోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.మిగిలిన మొత్తాన్ని ప్రపంచ బ్యాంక్ సమకూర్చనుంది.సింగపూర్ కంపెనీలు విప్రోల సంయుక్త భాగస్వామ్యంలో మూడు దశల్లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేస్తారు.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 33 శాఖలు,315 హెచ్ఓడీలు,745 ఈ సేవలన్నిటిని ‘ఈ ప్రగతి ‘ పేరుతో ఒకే గొడుగు కిందకు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీన్ని 72 ప్రాజెక్టులు, 14 ప్యాకేజీలుగా వర్గీకరించారు. దక్షిణాసియా దేశాల్లో నే తొలిసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టడం విశేషం.

8.అన్న దీవెన 

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ‘అన్న దీవెన’ పేరిట బాలింతల కోసం సరికొత్త కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది.మాతృ, శిశు మరణాలు అరికట్టేందుకు బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు.పాత బెల్లం, రాగి పిండి,వేరుశనగలు, మదర్ హార్లిక్స్ తో పాటు గొడుగు,టోపీల తో కూడిన సరుకులను పంపిణీ చేస్తారు.

9.మన అమరావతి-మన మట్టి-మన నీరు.

అమరావతి నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిని భాగస్వాములు చేసేలా ‘మన అమరావతి – మన మట్టి – మన నీరు’ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.ప్రతి గ్రామం,ప్రతి పురపాలక వార్డు నుంచి కిలో మట్టి పావు లీటర్ నీళ్ళు సేకరించి నూతన రాజధాని తరలించే ఏర్పాట్లు చేసింది.

రాష్ట్రంలోని 16 వేల గ్రామాల్లో అందరూ పవిత్ర పుణ్య జలాలను, పుట్టమట్టిని సేకరించి మంగళ హారతులు,పెద్దల ఆశీస్సులు నడుమ ఊరేగింపు చేసి ఇ మండల,జిల్లా కేంద్రాల ద్వారా రాజధానిని చేర్చడం ఈ కార్యక్రమ ఉద్దేశం.

10. నా ఇటుక – నా అమరావతి 

ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా నా ఇటుక నా అమరావతి అనే విన్నూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమాన్ని విజయవాడలో సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.

రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కనీసం ఒక ఇటుకనైనా విరాళంగా అందజేసేందుకు వీలుగా ఆన్లైన్ చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టారు. అమరావతి ఇటుకను ఆన్లైన్ విధానంలో ఎవరైనా కనీసం రూ.10 పెట్టి కొనుగోలు చేయవచ్చు.ఇలా కొనుగోలు చేసిన వారి వివరములను amaravati.gov.in ఎలక్ట్రానిక్ డేటాబేస్ లో ఉంచుతారు.

11. ద్రోణాచార్య

ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేయడంలో భాగంగా నిరుద్యోగ బ్రాహ్మణ యువత కోసం ద్రోణాచార్య పథకాన్నీ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించారు. ఇందులో భాగంగా నైపుణ్యాల అభివృద్ధిలో శిక్షణ ఇస్తారు.

12. ఎన్టీఆర్   జలసిరి

ఎన్టీఆర్ జలసిరి పథకం కింద ఆంధ్రప్రదేశ్ భూగర్భ జలాలకు కొరతలేని చోట్ల ప్రభుత్వ ఖర్చులతో రైతులకు లక్ష బోర్లు తవ్వించి మోటార్లు కూడా బిగించి ఇస్తారు.విద్యుత్ కనెక్షన్ మోటార్ కు అయ్యే ఖర్చుతో ఎస్సీ,ఎస్టీ రైతులు 5 శాతం ఇతరులకు 20 శాతం భరిస్తే చాలు.

అనంతపురం జిల్లా మినహా రాష్ట్రమంతటా అమలు చేస్తున్నారు.అనంతపురం జిల్లా లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయిన కారణంగా మినహాయించారు. 12 జిల్లాల్లో ఆయకట్టు (కమాండ్), ఆయకటేతర (నాన్ కమాండ్) ప్రాంతాల్లో బోర్లు తవ్వించినా తర్వాత సబ్సిడీ కింద సూక్ష్మ సేద్యం సౌకర్యం కూడా కల్పించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మొత్తం 1,496 కోట్ల వ్యయంతో అవుతుందని ప్రణాళిక శాఖ అంచనావేసింది.

13. షీ ఆటో

షీ ఆటో పథకం కింద మహిళలకు పూర్తిగా సిఎన్జీ తో నడిచే ఆటోలను పంపిణీ చేస్తారు. ఈ ఆటోలు పర్యావరణనికి హితమైనవి.మహిళా ప్రయాణికులకు రక్షణ కల్పించడానికి ఈ పథకం దోహదపడుతుందని సీఎం చెప్పారు.

రూ 1.91 లక్షలు ఇలా విలువచేసే ఒక్కో ఆటోకు ప్రభుత్వం ఏడు శాతం రాయితీ అందించగా మిగతా మొత్తాన్ని 40 వాయిదాల్లో నెలకు 4500 చొప్పున చెల్లించే అవకాశం లబ్ధిదారులకు కల్పించారు.

14.ఇ-స్పందన

ప్రజలు నేరుగా తమకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు ‘ఇ-స్పందన’ డిజిటల్ పంచాయతి పోర్టల్ ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలో ఆవిష్కరించారు.

డిజిటల్ పంచాయతీ వెబ్ సైట్ ద్వారా వివాహ దృవీకరణ పత్రం,ఆస్తి విలువ పత్రం, మ్యుటేషన్, మంచి నీటి కుళాయి కనెక్షన్.నిరభ్యంతర పత్రం, భవన నిర్మాణాలకు అనుమతులు, లే అవుట్ అనుమతులు,జనన, మరణాల నమోదు,ఇంటి పన్ను చెల్లింపు,వృత్తి లైసెన్స్,ఉపాధి హామీ పనులు,జాబ్ చార్ట్ లాంటి సేవలు అన్ని ఆన్ లైన్ లొనే అందించుచున్నారు.

ఐటీ శాఖ రూపొందించిన ‘ఇ-స్పందన’ద్వారా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఐటి సమస్యలు ఏర్పడితే పోర్టల్ లాగిన్ అయ్యి ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తారు.

15 నీరు – ప్రగతి 

ఆంధ్రప్రదేశ్ లో సగటు వర్షపాతం 940 మిల్లీ లీటర్లు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం, కొన్ని చోట్ల తక్కువ కురుస్తోంది.నీటిని నిల్వ చేసుకోవాలంటే రిజర్వాయర్లు కట్టుకోవాలి. భూమిని జలాశయంగా మార్చుకోవాలి.రాష్ట్రవ్యాప్తంగా ఒక మీటరు భూగర్భ జల మట్టం పెరిగిందంటే 90 టీఎంసీలు భూమిలో నిలవ చేసుకుంన్నట్లే.

ఏటా కురిసే సగటు వర్షపాతం ద్వారా 5 వేల టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుంది. కురిసిన వర్షాన్ని భూమిలోకి ఇంకే ఏర్పాటు చేసుకోవాలి. నీరు ఉంటే ప్రగతి సాధ్యమవుతుంది. అందుకే నీటికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ‘ నీరు-ప్రగతి’ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు.ఏపీ సీఎం చంద్రబాబు అనంతపురంలో ‘నీరు-ప్రగతి’ కార్యక్రమాన్ని డిసెంబర్ 29న ప్రారంభించారు.

16. జన్మ భూమి- మా ఊరు 

విజయనగరం జిల్లా బొండపల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి జన్మభూమి కార్యక్రమం నాంది కావాలని పేర్కొన్నారు. 17 ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ (NTR Beach Festival)

ఏటా సంక్రాంతికి ముందు సాగర సంబరాల పేరుతో నిర్వహిస్తున్న ఉత్సవాలను ఎన్టీఆర్ బీచ్ ch ఫెస్టివల్ పేరుతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది

18. చంద్రన్న సంచార చికిత్స

మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సంచార వైద్య  చికిత్సను ప్రారంబించారు. పిరామిల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో 275 మొబైల్ మెడికిల్ యూనిట్ల (ఎంఎంయూ) వాహనాలను ఏర్పాటు చేశారు. రాష్టంలోని 13 వేల గ్రామాలలో ఈ సంచార వైద్య  వాహనాలు సేవలందించనున్నాయి.గర్భిణిలకు, చిన్నారులకు, సాధారణ వ్యాధులకు, తీవ్రమైన  అంటువ్యాధులకు, దంత, కంటి, ఈఎన్ టి సహా పలు వైద్య పరీక్షలను నిర్వహించి చికిత్స అందిస్తారు. వ్యాధి నిరోధక టీకాలను వేస్తారు.

19. చంద్రన్న ఉన్నత విద్యాదీపం

దేశంలో నిర్వహించే అన్ని పోటి పరీక్షల్లో 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యార్దులు అగ్రగామిగా నిలవాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యం ‘చంద్రన్న ఉన్నత విద్యాదీపం’ పథకాన్ని ప్రారంభించింది . 24 రోజుల పాటు గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లోని అంశాలను బోధిస్తూ శిక్షణ అందిస్తున్నారు.

20. దివ్యదర్శనం 

పేద భక్తులను తిరుమల సహా రాష్ట్రంలోని మూడు, నాలుగు, పుణ్యక్షేత్రాలకు ఉచితంగా  తీసుకేల్లెందుకు ‘ దివ్యదర్సనం’ పథకం ఏపి ప్రభుత్యం రూపొందించింది.

ఆలయాల్లో దర్సనం మొదలుకొని, రవాణా, వసతి, భోజనం తదితర వసతులన్నీ ఉచితమే  ఇందుకయ్యే మొత్తం ఖర్చు దేవాదాయశాఖ భరించనుంది.

దివ్యదర్శనం పథకం క్రింద ఒక్కో జిల్లా నుంచి ఏడాదికి 10 వేల మంది చొప్పున , ఏడాదికి 1.30 లక్షల మంది భక్తుల్ని తీర్దయాత్రలకు తీకెళ్ళేలా దేవాదాయశాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో 90 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, బిసీ వర్గాలకు చెందిన భక్తుల్ని తీసుకెళ్లాలని దేవాదాయశాఖ  నిర్ణయించింది.

21. ఎన్టీఅర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం

‘ఎన్టీఅర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం’ లో భాగంగా 2016-17 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యం రెండు లక్షల ఇళ్ళను మంజూరు చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ,ఉపాధి  హామీ నిధులతో వీటి నిర్మాణం చేపట్టనుంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 2.25 లక్షలు కేటాయిస్తారు. ఒక్కో ఇల్లు ౩౦౦ చదరపు అడుగుల విస్తీర్ణం ( మరుగుదొడ్డితో సహా ) ఉండాలి.

22. బడికొస్తా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్య పాటశాలల్లో విద్యార్ధినుల హాజరుశాతాన్ని పెంచేందుకు ‘బడి కొస్తా’ అనే  నూతన పతాకాన్ని రాష్త్రప్రభుత్యం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ పథకం అమల్లో భాగంగా  తొలుత ప్రభుత్య ఎయిడెడ్, జడ్పి, పురపాలక, ఆదర్శ పాటశాలల్లోని తొమ్మిదో తరగతి విద్యార్ధినులకు  ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

2౩. మిషన్ హరితాంధ్రప్రదేశ్ 

రాష్ట్రంలో ప్రస్తుతమున్న 26 శాతం పచ్చదనాన్ని 2050 నాటికి 50 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రతి  ఒక్కరు మొక్కలు నాటే కార్యక్రమం ఇది. రాష్ట్రంలో కొత్తగా 50 కోట్ల మొక్కలు నాటాలి. అనేది దీని  ముఖ్యోద్దేశం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు పది మొక్కలు చొప్పున నాటితే 50 కోట్ల మొక్కలు అవుతాయి.

24. ఎన్టీఅర్ ఆశయం 

అనంతపురం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసి కరవును పారదోలేందుకు ‘ఎన్టీఅర్ ఆశయం’ పేరుతో ఏపి ప్రభుత్యం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. రూ. 6,554 కోట్లతో ఈ ప్యాకేజీని అమలు చేస్తారు. జిల్లాలో కరవు నివారణకు రూ. 1767 కోట్లు ; వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలకు రూ. 2654 కోట్లు, తాగునీటి ఎద్దడి నివారణకు రూ. 500 కోట్లు, పారిశ్రామిక అభివృద్ధికి రూ. 100 కోట్లు రహదారుల అభివృద్ధికి రూ.139 కోట్లు, స్వచ్చంధ్రప్రదేశ్ క్రింద రూ. 94 కోట్లు, పేరూరు జలాశయం తొలి దశకు రూ. 450 కోట్లు కేటాయించారు.

25. అన్న సంజీవని 

తక్కువ ధరలకే ప్రజలకు మందులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్యం ‘ అన్న సంజీవని’ పేరుతో  జనరిక్ దుకాణాలను డ్వాక్రా సంఘాల ద్యారా నిర్వహిస్తుంది.

26 చంద్రన్న భీమా 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల కోసం చంద్రన్న బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.చంద్రన్న బీమా 15 నుంచి 70 ఏళ్ల లోపు వారికి వర్తిస్తుంది.భీమా చెల్లించిన వ్యక్తి చనిపోయినా, పూర్తిగా వికలాంగుడైనా మూడు వారాల్లోగా 5 లక్షలు అందిస్తారు. చనిపోయిన వెంటనే 7 వేల రూపాయలు కుటుంబానికి అందిస్తారు. ఇందుకోసం 155214 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు.

27 ఆరోగ్య రక్ష 

రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించే లక్ష్యంతో దారిద్ర్యరేకకు ఎగువన ఉన్నవారికోసం ప్రవేశపెట్టిన ‘ఆరోగ్య రక్ష’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వపరంగా అమలవుతున్న ఎలాంటి ఆరోగ్య కార్యక్రమం పరిధిలోకి రాని సుమారు 35 లక్షల కుటుంబాలకు వైద్యసేవలు అందించే ఆశయంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.

ఆరోగ్య రక్ష పథకంలో చేరాలనుకునే ఒక్క వ్యక్తికి రూ.100 చొప్పున ఏడాదికి 1200 చెల్లించాలి. కుటుంబలో సభ్యులందరూ చేరాలి.ఈ పథకంలో చేరిన వారికి 2 లక్షల వరకు ఉచిత వైద్య సేవ అందుతుంది.రాష్ట్రంలోని 432 ఆసుపత్రులలో 1,044 రకాల జబ్బులకు సేవలు పొందే సదుపాయం కలుగుతుంది.కుటుంబంలో ముగ్గురు ఉంటే ఆరు లక్షల వరకు వైద్య సేవలు పొందే అవకాశముంది. పథకం కాలం పరిమితి ఏడది ఉంటుంది.ఫిబ్రవరి 28వ తేదీ లోపు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా లేదా మీ సేవలో ఆధార్ కార్డు ద్వారా పేర్లను నమోదు చేసుకుని ఆరోగ్య కార్డులను పొందవచ్చు.

28. పుర సేవ 

పురపాలక సంఘాల్లో పౌర సమస్యలు పరిష్కరించడం, సేవలు మరింత సులభంగా అందించడానికి వీలుగా ఏపీ పురపాలక శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ ‘పురసేవ’ రూపొందించింది.పట్టణాలు, నగరాల్లో పౌరులు తన సమస్యలను ఈ యాప్ ద్వారా ఆయా పురపాలక సంఘానికి పంపితే అధికారులు తక్షణం ఆ సమస్యపై స్పందించి పరిష్కరించడంతో పాటు దానికి సంబంధించిన సమాచారాన్ని ఆ పౌరుడికి సెల్ ఫోన్ సందేశం కూడా పంపుతారు.

29. ఏపీ పర్సు 

ఏపీ పర్సు అనేది వాడుకలో ఉన్న ఈ వ్యాలెట్ చెల్లింపు యాప్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ను ఒక వేదిక మీదకు తీసుకు రావడం. సైబర్ నెట్ లిమిటెడ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దీన్ని రూపొందించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రజలను డిజిటల్ ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్ది,వాళ్లను నగదు రహిత లావాదేవీల వైపు మళ్లించేందుకు ‘మార్పు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రారంభించారు.

30. స్వాస్థ్య విద్యావాహిని

ఈ కార్యక్రమం ద్వారా పది నెలల తో పాటు ప్రతిరోజు 446 వైద్య విద్యార్థుల బృందాలు గ్రామాల్లో 10 లక్ష్యాలతో పర్యటించి స్థానికులకు పరిసరాల పరిశుభ్రత,అనారోగ్యాల బారిన పడకుండా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు,తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు.